ETV Bharat / city

Nara Lokesh: 'దొంగ ఓట్లు వేయిస్తూ... ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశారు' - నారా లోకేశ్ ట్వీట్టర్

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా నేతలు ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు.

Nara Lokesh
Nara Lokesh
author img

By

Published : Nov 15, 2021, 7:21 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో దొంగఓట్లు(Fake votes) వేయిస్తూ.. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) విమర్శించారు. తెలుగుదేశం నేతలను పోలీసులతో నిర్బంధించి.. ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దొంగఓటర్లను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలను వదలి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకొని వేధించడం దుర్మార్గమని అన్నారు.

  • బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే.. ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు @ysjagan. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని జ‌గ‌న్‌రెడ్డి న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశారు.(1/4) pic.twitter.com/Huh0j42mFo

    — Lokesh Nara (@naralokesh) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇతర ప్రాంతాల వారిని పోలీసులు ఎలా రానిచ్చారని(Fake votes) లోకేశ్ ప్రశ్నించారు. ఓట‌మి త‌ప్పద‌ని తెలిసే.. సీఎం జగన్ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు(Vijayavani college in Kuppam) కుప్పంలో దొంగఓట్లు(Fake votes) వేసేందుకు వచ్చిన వారి వీడియోను ఆయన విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్​ కుప్పంలోని విజయవాణి కళాశాల(Vijayavani college in Kuppam) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. దొంగ ఓట్లు(Fake votes) వేయించేందుకు స్థానికేతరులను వైకాపా నేతలు తీసుకువచ్చారని తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాణి పాఠశాలలో బస చేసిన స్థానికేతరులను ఎక్కడి నుంచి వచ్చారు.. ఎందుకొచ్చారని కుప్పం తెదేపా మహిళా నాయకులు ప్రశ్నించారు. తెదేపా నేతల నిలదీతతో స్థానికేతరులు ముఖాలు దాచుకున్నారు. దొంగఓట్లు వేసేందుకు వచ్చిన స్థానికేతరులను అరెస్టు చేయాలని విజయవాణి కళాశాల వద్ద తెదేపా నేతలు ఆందోళన(TDP leaders protest at vijayavani college in kuppam) చేపట్టారు. వీరిపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనలో ఓ కార్యకర్త స్పృహ కోల్పోయాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

మాజీ ఎమ్మెల్సీ అరెస్టు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో దొంగఓట్లను ఆపాలంటూ తెదేపా నేతలు చేసిన ఆందోళనలో... మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు అరెస్టు అయ్యారు. శ్రీనివాసులు అరెస్టుపై పోలీసులను నిలదీసిన తెదేపా శ్రేణులపై లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులకు, తెదేపా కార్యకర్తలకు మధ్య తోపులాట..

కుప్పం వస్తున్న మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, తెదేపా నేత పులివర్తి నానిని పోలీసులు ఆపేశారు. వారిని వ్యానులోకి ఎక్కించేందుకు యత్నించగా... తెలుగుదేశం కార్యకర్తలు(tdp activist ) అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, తెదేపా కార్యకర్తలకు(tdp activist ) మధ్య తోపులాట జరిగింది. కుప్పం ఎన్నికల్లో వైకాపా ఓడితే జగన్‌ సీఎం(AP CM Jagan) పదవి పోతుందా అని మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ఆగ్రహించారు. మెప్మా, వెలుగు, ఇతర ఉద్యోగులకు ఇంకా కుప్పంలో పనేంటని ధ్వజమెత్తారు.

ఇదీ చూడండి: lathi charge by police: కుప్పంలో ఉద్రిక్తత.. తెదేపా నేతలపై లాఠీఛార్జ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.