MLA Rama naidu injured: ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రమాదవశాత్తు సైకిల్‌పై నుంచి జారిపడ్డారు. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలంటూ ఆయన పాలకొల్లు నుంచి అమరావతిలోని అసెంబ్లీ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. అందులో భాగంగా ఆయన దెందులూరు మండలం శింగవరం వద్ద రోడ్డుపై ప్రమాదవశాత్తు పడిపోయారు.
ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలికి స్వల్పంగా గాయమైంది. సైకిల్ యాత్రలో పాల్గొన్న ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్వల్ప విరామం అనంతరం రామానాయుడు యాత్రను తిరిగి ప్రారంభించారు.
ఇదీ చదవండి: NIA Raids in Kurnool : కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు