వైకాపాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతల బృందం రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. గవర్నర్‌ను కలిసిన అనంతరం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
తెదేపా ప్రధాన కార్యాలయం, నేతలపై దాడులకు సంబంధించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. వైకాపాపై చర్యలు తీసుకోవాలని కోరాం. గవర్నర్ ముందు రెండు డిమాండ్లు పెట్టాం. రాష్ట్రంలో ఆర్టికల్ 356 విధించాలి. గత 3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి. మా ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. -తెదేపా నేతలు
'దిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో అసమర్థ డీజీపీ ఉన్నారు. తెదేపా కార్యాలయంపై దాడి చేస్తే... తిరిగి మాపైనే కేసులు బనాయించారు. ఘటన జరిగిన సమయంలో నారా లోకేశ్ అక్కడ లేకపోయినా ఆయనపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు' అని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా నేతలు పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
ఇదీ చదవండి: