ETV Bharat / city

TDP Leaders Met Governor: 'కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించండి' - Gudivada Casino issue

TDP Leaders Met Governor: ఏపీ రాజ్​భవన్​లో గవర్నర్​ బిశ్వభూషణ్​ను తెలుగుదేశం నిజనిర్ధరణ కమిటీ కలిసింది. గుడివాడలో జరిగిన క్యాసినో నిర్వహణపై ఫిర్యాదు చేసింది. క్యాసినో నిర్వహణపై కరపత్రాలు, వీడియో సాక్ష్యాలు గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి సోసోడియాకు కమిటీ నాయకులు అందజేశారు.

TDP Leaders Meet Governo
ఏపీ గవర్నర్​ను కలిసిన తెదేపా నేతలు
author img

By

Published : Jan 27, 2022, 1:34 PM IST

Updated : Jan 27, 2022, 2:08 PM IST

TDP Leaders Met Governor: ఆంధ్రప్రదేశ్​లోని గుడివాడలో క్యాసినో వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ బిశ్వభూషణ్​ హరిచందన్​ను తెదేపా నిజనిర్ధరణ కమిటీ కోరింది. స్వల్ప అస్వస్థత కారణంగా గవర్నర్‌ తమను కలవలేదని... రాజ్‌భవన్‌ అధికారి సిసోడియాకు చంద్రబాబుకు సమర్పించిన నివేదికను కమిటీ గవర్నర్‌కు అందజేసింది. క్యాసినో నిర్వహణపై వీడియో సాక్ష్యాలు కూడా అందజేసిన కమిటీ... గుడివాడలో తెదేపా నేతలపై దాడి, పోలీసుల వ్యవహారాన్ని వివరించింది. క్యాసినో తర్వాత 13 మంది యువతులు ఈ నెల 17వ తేదీన విజయవాడ నుంచి బెంగళూరు మీదుగా గోవా వెళ్లినట్టు ఆధారాలు అందజేసింది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. గుడివాడలో క్యాసినో నిర్వహణపై విచారణ కోరుతూ అధినేత చంద్రబాబు రాసిన లేఖను కూడా సిసోడియాకు కమిటీ అందించింది.

కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించండి: తెదేపా నిజనిర్ధరణ కమిటీ

వాటిని క్యాసినోలో వినియోగించారు

గుడివాడ క్యాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్ సహా ఎవరికి ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెదేపా నిజనిర్ధరణ కమిటీ సభ్యులు ఆరోపించారు. క్యాసినో నిర్వహణ, ఉద్యోగుల సమస్యలు పక్కదోవ పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. క్యాసినో నిర్వహణలో అనుమతిలేని విదేశీ మద్యం, డ్రగ్స్ వినియోగం పెద్దఎత్తున జరిగిందన్న నేతలు మనీ ల్యాడరింగ్, విదేశీ మద్యం, డ్రగ్స్ వినియోగంతో పాటు దేశభద్రతకు విఘాతం కలిగించే పరికరాలు క్యాసినోలో వినియోగించారని చెప్పారు. తక్షణమే ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

"సాక్ష్యాలతో సహా నివేదికను గవర్నర్​ వ్యక్తిగత కార్యదర్శి సిసోడియాకు అందించాం. నిజాయతీగా పనిచేసే అధికారిని విచారణకు వేసి ఉంటే నిందితులు ఇప్పటికి జైల్లో ఉండేవారు. క్యాసినో అనంతరం 13 మంది యువతలను రాష్ట్రానికి రప్పించినట్లు ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్​ స్పందించి కొడాలి నానిని బర్తరఫ్​ చేయాలి. ఎవరూ స్పందించకపోయినా కొడాలి నానిని వదిలిపెట్టబోం." -వర్ల రామయ్య, తెదేపా నేత

రాయచోటిని జిల్లా కేంద్రంగా వ్యతిరేకిస్తూ..రాజంపేటలో విద్యార్దుల ఆందోళన

క్యాసినో నానిగా కొడాలి నాని

కొడాలి నానిని రక్షించేందుకు ముఖ్యమంత్రి సహా అంతా తపన పడుతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. దుష్ట ఆలోచనలు ఉన్న మంత్రిని కాపాడాలనే సీఎం ఆలోచన అని విమర్శించారు. ఇక చేసేదిలేక గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్న కమిటీ సభ్యులు... గవర్నర్ అస్వస్థతకు గురైనందున ఆయన కార్యదర్శి సిసోడియాకు ఫిర్యాదు, సాక్ష్యాలు అందజేశామని వెల్లడించారు. పేద, మధ్యతరగతి వాళ్ల జూదం కోసం ఒక టెంటు, 10వేలు కట్టే స్తోమత ఉన్న వారికి క్యాసినో ఏర్పాటు చేశారని తెదేపా బృందం ఫిర్యాదులో పేర్కొంది. కొడాలినాని క్యాసినో నానిగా మారి రాష్ట్రంలో విష సంస్కృతికి తెరలేపారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ క్యాసినోను ప్రపంచమంతా చూసినా జగన్ రెడ్డి చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

"క్యాసినో వ్యవహారం రాష్ట్రమంతటా తెలిసింది కానీ.. సీఎం జగన్​ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. డీజీపీ గౌతం సవాంగ్​ కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. క్యాసినో సంస్కృతిని రాష్ట్రం నుంచి తరిమేయాలి." --- బొండా ఉమ, తెదేపా నేత

సీఎం బాధ్యత వహించాలి

డీజీపీ చూసి కూడా చూడనట్లు నటిస్తున్నారని నేతలు మండిపడ్డారు. ఆధారాలు బయటపెడితే కొడాలినాని సూటిగా సమాధానం చెప్పలేక మమ్మల్ని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. చట్ట విరుద్ధంగా జరిగిన క్యాసినో పై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. క్యాసినో తో పాటు అక్కడ మహిళలతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. రెండు రోజుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మరోసారి తెరపైకి వచ్చిన మేడారం జాతరకు జాతీయ హోదా అంశం

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 27, 2022, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.