ETV Bharat / city

'వర్సిటీకి, వైఎస్సార్​కు సంబంధం ఏంటి..? జగన్​ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు' - ఏపీ తాజా వార్తలు

TDP on NTR Health University: ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. యూనివర్సిటీకి, వైఎస్సార్​కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి పనులతో సీఎం జగన్​.. చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని విమర్శించారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'వర్సిటీకి, వైఎస్సార్​కు సంబంధం ఏంటి..? జగన్​ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు'

author img

By

Published : Sep 21, 2022, 2:55 PM IST

TDP on NTR Health University: ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్​ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనమని చంద్రబాబు ధ్వజమెత్తారు. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీతో వైఎస్సార్‌కు ఏం సంబంధం ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ నిర్మించిన వర్సిటీకి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందేనని డిమాండ్​ చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్పు కాదు.. కొత్తగా నిర్మిస్తే పేరొస్తుందని చంద్రబాబు దుయ్యబట్టారు.

"హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళా కోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్ ప్రభుత్వం..ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతుంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్లు ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్​కు ఏం సంబంధం ఉంది? దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా.. ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలి." - తెదేపా అధినేత చంద్రబాబు

  • హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు జగన్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1986లో ఈ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు.(1/5) pic.twitter.com/y3oSAdHgYw

    — N Chandrababu Naidu (@ncbn) September 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • దశాబ్దాల నాటి సంస్థలకు ఉన్న పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా...ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును యధావిధిగా కొనసాగించాలి.(5/5)

చరిత్ర హీనుడు జగన్​రెడ్డి..: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ డిమాండ్ చేశారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్యని దుయ్యబట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం.. ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు. వైఎస్​కు హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఏంటని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృధి చేసింది ఎన్టీఆర్ అని లోకేశ్ గుర్తుచేశారు. తన చర్యలతో జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని విమర్శించారు.

"ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తుగ్లక్ చర్య. తెలుగు వారి ఆత్మగౌరవం స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ నెలకొల్పిన యూనివర్సిటీ ఇది. అసలు వైఎస్​కి, హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఏంటి? హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృద్ధి చేసింది ఎన్టీఆర్. ఈ చర్యలతో జగన్ రెడ్డి శాశ్వతంగా చరిత్రహీనుడుగా మిగిలిపోతారు." -తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​

  • అసలు వైఎస్ కి, హెల్త్ యూనివర్సిటీకి సంబంధం ఏంటి? హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పింది, అభివృద్ధి చేసింది ఎన్టీఆర్ గారు. ఈ చర్యలతో జగన్ రెడ్డి శాశ్వతంగా చరిత్రహీనుడు గా మిగిలిపోతాడు.(2/2)

    — Lokesh Nara (@naralokesh) September 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పుట్టే బిడ్డకీ ఆయన పేర్లు..: ఎన్టీఆర్ పేరు మార్చే దుస్సాహసం చేశారంటే, జగన్‌కు రోజులు దగ్గర పడినట్లేనని.. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌ అన్నారు. వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఆరోగ్య వర్సిటీకి అంకురార్పణ చేసిన ఎన్టీఆర్ పేరు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. వైకాపాలో అంతర్గతంగా సీక్రెట్ ఓటింగ్ నిర్వహించినా.. జగన్‌ తప్పు చేశారనే విషయం అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా జగన్‌ పోకడలపై ప్రజలంతా నిరసన తెలపాలని.. లేదంటే పుట్టే బిడ్డ నుంచి రాష్ట్రం వరకు అన్నింటికీ ఆయన పేర్లు పెట్టుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు.

శాడిస్టు ముఖ్యమంత్రికి పిచ్చికూడా పట్టింది కాబట్టే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చారని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జోలికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇక ఇంటికే పరిమితమవుతారని ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే కడప జిల్లాకు వైఎస్ పేరు తొలగించే ఆలోచన జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు. ఎన్టీఆర్ పేరుపై ఉద్యమిస్తామని మరో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తేల్చిచెప్పారు.

బీసీల ఉన్నతి కోసమే తెదేపాను ఎన్టీఆర్ స్థాపించారని ఎమ్మెల్యే అనగాని అన్నారు. వైద్య విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ వర్సిటీ స్థాపించారని గుర్తు చేశారు. మహనీయుడు పేరు వర్సిటీకి తొలగిస్తే బీసీలు ఊరుకోరని హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామన్నారు.

దేవినేని ధర్నా: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై దేవినేని ఉమా ధర్నా చేపట్టారు. గొల్లపూడి ఎన్టీఆర్ సర్కిల్‌లో తెదేపా కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. దేవినేని ఉమాతో పాటు తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్‌కు నేతలను తరలించారు.

ఇవీ చదవండి:

NTR Health University: ఎన్టీఆర్ పాయే.. వైఎస్సార్​ వచ్చే..

భారత సైన్యంలో సమూల మార్పులు.. ఇక అవన్నీ మాయం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.