ETV Bharat / city

TDP Dhulipalla Narendra: 'ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు'

TDP Dhulipalla Narendra: ఏపీ సీఎం జగన్ గుంటూరులో పర్యటించడం వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని తెదేపా సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పింఛన్​లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TDP Dhulipalla Narendra
జగన్​పై ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్​
author img

By

Published : Jan 2, 2022, 6:54 PM IST

TDP Dhulipalla Narendra: ఆంధ్రప్రదేశ్​లో ప్రజా కంటక పాలన సాగుతోందని తెదేపా సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. సీఎం జగన్.. గుంటూరు జిల్లాలో పర్యటించడం వల్ల ప్రజలకు జరిగిన మేలేమీ లేదన్నారు. సమస్యల కేంద్రంగా ఉన్న జిల్లాను సీఎం అభివృద్ధి చేస్తారని ప్రజలు పడ్డ ఆశ అడియాసగానే మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. రూ.2250 పింఛన్​ను 250 రూపాయలు పెంచి ప్రచార ఆర్భాటం చేశారని ఆరోపించారు. పింఛన్​లను 2 వేల నుంచి 3 వేలు చేస్తామని... నేడు విడతల వారీగా అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు.

ఏంటా బారికేడ్లు.?

ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుంటే 2 కిలో మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారని తెదేపా నేత విమర్శించారు. ఇండియా- పాకిస్థాన్ మధ్యలో కూడా ఇంత ఎత్తున బారికేడ్లు ఉండవేమో అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాకముందు ఒకలా... వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లపైన శ్వేతపత్రం విడుదల చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు: ధూళిపాళ్ల నరేంద్ర​

ఇదీ చూడండి: Ravinder singh on CM KCR: 'సీఎం కేసీఆర్​ రెండు సార్లు పిలిచారు.. అందుకే వెళ్లా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.