ETV Bharat / city

స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే బాధగా ఉంది: చంద్రబాబు - cbn today tweet

Chandrababu on Ganja: ఏపీలోని విజయవాడలో బాలికలు గంజాయికి బానిసలవ్వడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి అక్రమ రవాణాపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గంజాయి వల్ల పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల అలవాట్లపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు.

Chandrababu
Chandrababu
author img

By

Published : Oct 3, 2022, 5:50 PM IST

Chandrababu on Ganja: పోలీసులను రాజకీయ వేధింపులకు వాడటంలో మునిగిపోయిన ఏపీ ప్రభుత్వం.. యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలేయడం క్షమించరాని నేరమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెరపరిచి, ఎంతో ఆందోళన, ఆవేదనకు గురి చేసిందన్నారు. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే... పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెర పరిచింది. ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే... పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టాలి.(1/3) pic.twitter.com/W9YavwkBxG

    — N Chandrababu Naidu (@ncbn) October 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్​గా దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. సమూలంగా గంజాయిని అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

"స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే బాధగా ఉంది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవువుతోంది. సమూలంగా గంజాయి అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలి. రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడం ప్రభుత్వానికి అలవాటైంది. విద్యార్థుల జీవితాలను ప్రభుత్వం గాలికొదిలేయడం క్షమించరాని నేరం. తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది." -చంద్రబాబు

  • కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.(3/3)#WhoIsDrugDonInAP

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.