మాన్సాస్ ట్రస్టు కేసు (Mansas Trust)లో హైకోర్టు (ap high court) తీర్పుపై తెదేపా నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) హర్షం వ్యక్తం చేశారు. ట్రస్టు ఛైర్మన్‌గా తాను అక్రమాలు చేశానని లేనిపోని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఉద్యోగులను, సిబ్బందిని చాలా ఇబ్బందికి గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పగతోనే మాన్సాస్ కార్యాలయాన్ని తరలించారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం... చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలని వ్యాఖ్యానించారు. తీర్పు ఉత్తర్వులు అందిన తర్వాత మిగతా వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.
హైకోర్టు తీర్పు...
మాన్సాస్, సింహాచల ట్రస్టుల ఛైర్మన్ నియామక జీవోలను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ట్రస్టుల ఛైర్మన్ నియామక జీవోను కొట్టివేసింది. సంచయిత గజపతిరాజు నియామక జీవోను రద్దుచేసిన న్యాయస్థానం.. అశోక్ గజపతిరాజును ట్రస్టుల ఛైర్మన్‌గా పునర్నియమించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: etela rajender: భాజపా తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్