ETV Bharat / city

Chandra Babu Naidu: 'తెదేపా అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెడతా..' - చంద్రబాబు శపథం

ఏపీ అసెంబ్లీలో తన భార్య గురించి వైకాపా సభ్యులు నీచంగా మాట్లాడారంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు (Chandra Babu Naidu News)భావోద్వేగానికి గురయ్యారు. తెదేపా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశం మధ్యలో వెక్కివెక్కి ఏడ్చారు. తిరిగి తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాతే తాను అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశారు.

chandrababu naidu
chandrababu naidu
author img

By

Published : Nov 19, 2021, 4:01 PM IST

ఏం జరిగింది?

పీటీఐ వార్త సంస్థ కథనం ప్రకారం.. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపా మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో తాను మాట్లాడుతుండగా స్పీకర్​ మైక్​​ కట్​​ చేశారని చంద్రబాబు (Chandra Babu Naidu news) తెలిపారు. దాంతో అసెంబ్లీ నుంచి చంద్రబాబు, మిగతా తెదేపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. వెంటనే చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో ఏర్పాటుచేసిన సమావేశం మధ్యలో ఒక్కసారిగా బోరున విలపించారు. వెక్కివెక్కి ఏడ్చారు. తన భార్యను అవమానించేలా అసెంబ్లీలో అధికారపక్షం వాళ్లు మాట్లాడారంటూ చంద్రబాబు గద్గద స్వరంతో తెలిపారు.

'ఇన్నాళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరినీ అవమానించేలా మాట్లాడలేదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగలేదు. అధికారం పోయినప్పుడు కుంగిపోలేదు. ఎవరి పట్లా అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ ఇవాళ నా భార్య గురించి అసెంబ్లీలో వైకాపా నాయకులు మాట్లాడిన భాష నీచంగా ఉంది. అందుకే తెదేపా అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెడతా.'

- చంద్రబాబు నాయుడు, తెదేపా అధ్యక్షుడు

ఎప్పుడు ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు ఒక్కసారిగా కన్నీటి పర్యంతం కావడంతో తెదేపా ఎమ్మెల్యేలంతా ఆయనను ఓదార్చారు. ఆయనకు అండగా ఉంటామన్నారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సభాపతి తమ్మినేని కూడా ఆలోచించుకోవాలని సూచించారు. తాను మాట్లాడుతుండగానే మైక్‌ కట్‌చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ్మినేని తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని.. గౌరవంగా బతికేవాళ్లను కూడా వైకాపా సభ్యులు కించపరుస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. '40 ఏళ్లు పనిచేసింది.. ఇలా అవమానపడడానికా అని బాధపడుతున్నా.. అవతలివారు బూతులు తిడుతున్నా.. సంయమనం పాటిస్తున్నా.. నాకు బూతులు రాక.. తిట్టలేక కాదు... అది మా విధానం కాదు.. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదని చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు.

ఇదీచూడండి: Chandrababu news today: ఇది గౌర‌వ స‌భా.. కౌరవ స‌భా: చంద్రబాబు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.