ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ఇసుక కొరతపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన 12 గంటల దీక్ష ముగిసింది. భవన నిర్మాణ కార్మికులు నిమ్మరసం ఇచ్చి.. చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. దీక్షకు సంఘీభావంగా హాజరైన జనసేన, ఆమ్ ఆద్మీ నాయకులతో పాటు.. కుల సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు, ఇతర అన్ని వర్గాల వారికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన దీక్షకు అందరి నుంచ మద్దతు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:వాతావరణ మార్పులతో.. పిల్లల ఆరోగ్యానికి పెను ముప్పు