చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా నేతల బృందం దిల్లీ చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12.గం.కు బృందంలోని ఐదుగురు సభ్యులు రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించి.. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కోరనున్నారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెరిగిపోతోందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేయనున్నారు. అలాగే.. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై రామ్‌నాథ్ కోవింద్‌కి సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు సమయం కోరారు. అనంతరం తెదేపా నేతల బృందం పలువురు కేంద్రమంత్రులను కూడా కలవబోతోంది.
ఇదీ చూడండి: CBN: ఆంధ్రప్రదేశ్‌ను రిపేర్ చేయాల్సిన సమయం వచ్చేసింది: చంద్రబాబు