ETV Bharat / city

తెదేపా అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నామినేషన్ పత్రాలు మాయం..! - ఏపీ 2021 వార్తలు

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో.. నామినేషన్ వేసేందుకు వెళ్లిన తెదేపా అభ్యర్థి నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకే నామినేషన్ సమయం ముగియనుండగా.. తెదేపా అభ్యర్థి ఆందోళన పడుతున్నారు.

tdp-candidate-nommination-papers-thefted-in-kuppam

author img

By

Published : Nov 5, 2021, 4:10 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో... తెదేపా నాయకుల నామినేషన్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నామినేషన్ల చివరి రోజైన నేడు... కుప్పం 14వ వార్డులో తెదేపా తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్తున్న మాజీ ఏంపీపీ వెంకటేష్​పై పలువురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.

ఈ క్రమంలోనే అతడి వద్ద నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని పారిపోయారు. సమాచారం అందుకున్న మాజీమంత్రి అమర్​నాథ్ రెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకొని గాయపడ్డ వెంకటేష్​ను ఆస్పత్రికి తరలించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల సమయం ముగియనుండటం వల్ల సదరు అభ్యర్థి ఆందోళనకు గురవుతున్నారు. తమ పార్టీ అభ్యర్థిపై దాడి చేసింది.. వైకాపా కార్యకర్తలేనని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.