భారీ వర్షాలతో రాష్ట్రంలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. 43వేలకుపైగా చెరువులకుగానూ 24వేలకు పైగా చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మరో 11వేలకుపైగా చెరువులు 75 శాతం నుంచి పూర్తిగా నిండాయి. 3,600కుపైగా చెరువులు సగం నుంచి 75శాతం వరకు నిండాయి. సగం, అంతకంటె తక్కువ నిండిన చెరువులు కేవలం నాలుగువేలలోపే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కృష్ణా బేసిన్లో దాదాపు 15వేల చెరువులు, గోదావరి బేసిన్లో తొమ్మిదివేలకుపైగా చెరువులు అలుగు పోస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొత్తం 660కిపైగా చెరువులు దెబ్బతిన్నాయి. గండ్లు పడి, కట్టలు తెగి... వరద నీరు భారీగా పంట పొలాల్లోకి చేరింది.
ఇదీ చూడండి: నిండుకుండలా హుస్సేన్‌సాగర్.. తరలివస్తున్న పర్యాటకులు