Talasani Srinivas Yadav: భాజపా జాతీయ సమావేశాలకు హైదరాబాద్‌లో రెండ్రోజులు ఉన్న నేతలు... ఇక్కడి అభివృద్ధి, శాంతిభద్రతల గురించి తెలుసుకుని వారి రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. బహిరంగ సభలో మోదీ ప్రసంగం చప్పగా సాగిందన్న ఆయన... కేసీఆర్ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేకపోయారన్నారు. భాజపాలో అంతా కాలం చెల్లిన నేతలే ఉన్నారని తలసాని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో తలసాని మాట్లాడారు.
'భాజపా బహిరంగ సభలో మోదీ ప్రసంగం చప్పగా సాగింది. మోదీ హైదరాబాద్ అందాలు చూసి వెళ్లారు. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేకపోయారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. అనవరసరంగా భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశం నుంచి భాజపాను తరిమికొట్టాలి. సభలో అమిత్‌షా నీళ్లు, నియామకాల గురించి మాట్లాడారు. రెండ్రోజులు భాజపా నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా?' - తలసాని శ్రీనివాస్‌యాదవ్, మంత్రి
మోదీ హైదరాబాద్ అందాలు చూసి వెళ్లారని.. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం చెప్పలేకపోయారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఎక్కడా జరగడం లేదని.. అనవసరంగా భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దేశం నుంచి భాజపాను తరిమికొట్టాలన్నారు. సభలో నీళ్లు, నియామకాల గురించి అమిత్‌షా మాట్లాడారని.. రెండు రోజులు భాజపా నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా? అని ప్రశ్నించారు. ప్రముఖులు వచ్చినప్పుడు భద్రతా వ్యవహారాలు చూసే రాష్ట్ర పోలీసులపై భాజపా నేతల విమర్శలు సరికాదని మంత్రి ఆక్షేపించారు.