ETV Bharat / city

'దుబ్బాక స్ఫూర్తితో జీహెచ్​ఎంసీలో భాజపాను గెలిపించండి'

ముఖ్యమంత్రి కేసీఆర్​కు దుబ్బాక ప్రజలు కనువిప్పు కలిగించారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆచారి అన్నారు. నాగోలులో నిర్వహించిన 'తెలంగాణ బీసీల గోస'సభకు హాజరయ్యారు. దుబ్బాక స్ఫూర్తితో జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని కోరారు.

talangana bc gosa meeting in hyderabad nagole
'దుబ్బాక స్ఫూర్తితో జీహెచ్​ఎంసీలో భాజపాను గెలిపించండి'
author img

By

Published : Nov 11, 2020, 3:45 PM IST

దుబ్బాక ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించారని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి అన్నారు. నాగోలులో జరిగిన 'తెలంగాణ బీసీల గోస' సభకు బండి సంజయ్, కె. లక్ష్మణ్​తో కలిసి హాజరయ్యారు. నీతి, నిజాయితీ, నిస్వార్థంతో పనిచేస్తున్న భాజపాను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రూ.5 వేల కోట్లతో ప్రారంభమైన గొర్ల పంపిణీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా లేదని ఎద్దేవా చేశారు. బీసీల పేరుతో అనేక మంది సంఘాలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు కానీ... బీసీల బిడ్డ బండి సంజయ్ మీద సీపీ చేయి వేస్తే ఒక్క నాయకుడు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ నాయకులమని చెప్పుకోవడానికి సిగ్గు పడాలని ఆక్షేపించారు.

పేదల జోలికి వస్తే ఎలా ఉంటుందో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కు దుబ్బాక ప్రజలు రుచి చూపించారని బండి సంజయ్​ ఎద్దేవా చేశారు. కేసీఆర్​కు బీసీల మీద ప్రేమ ఉంటే... తెరాస అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్​లో కూతురుని, దుబ్బాకలో అల్లుడిని ఓడగొట్టాం... జీహెచ్​ఎంసీలో తండ్రీకొడుకుల పని పడ్తామని వ్యాఖ్యానించారు. కులవృత్తులను నిర్వీర్యం చేస్తూ... బీసీల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. హిందువులను చీల్చే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్​... కొడుకుకు ముఖ్యమంత్రిని చేసేందుకే యాగాలు చేశాడని విమర్శించారు.

ఇదీ చూడండి: శ్రీవారి సన్నిధిలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.