ETV Bharat / city

కేసీఆర్​తోనే దక్షిణ తెలంగాణకు అన్యాయం: అఖిలపక్షం - కృష్టా నది-తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై టీ-జర్నలిస్టు ఫోరం సమావేశం

కృష్ణా నది-తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టు అనే అంశంపై టీ-జర్నలిస్ట్ ఫోరం... హైదరాబాద్​లో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దక్షిణ తెలంగాణను ప్రభుత్వం నిరాధారణకు గురి చేస్తుందని అఖిలపక్ష నేతలు విమర్శించారు. కృష్ణానదిలో తెలంగాణ వాటా సాధించేలా... ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావడం, ప్రాజెక్ట్​లను సందర్శించి వర్క్ షాపులు నిర్వహించాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.

t-journalists forum conduct meeting on krishna river-telangana pending projects
కేసీఆర్​తోనే దక్షిణ తెలంగాణకు అన్యాయం: అఖిలపక్షం
author img

By

Published : Sep 4, 2020, 7:50 AM IST

కేసీఆర్​తోనే దక్షిణ తెలంగాణకు అన్యాయం: అఖిలపక్షం

కృష్ణా నది-పెండింగ్ ప్రాజెక్టులు అనే అంశంపై టీ-జర్నలిస్ట్ ఫోరం ఆద్వర్యంలో... అఖిలపక్ష సమావేశం జరిగింది. టీ-జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్​ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి , వంశీచంద్ రెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, భాజపా నేతలు జితేందర్ రెడ్డి, వివేక్ హాజరయ్యారు. పోతిరెడ్డిపాడు ఆపడం కోసం తెలంగాణలోని అన్ని పక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో జగన్​కు ఇచ్చిన డబ్బుల కోసమే పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ చూసి చూడనట్లు ఆరోపించారు. దక్షిణ తెలంగాణ ఎడారి అయ్యే అవకాశం ఉన్నందున... ప్రజా ఉద్యమాలతో పోతిరెడ్డిపాడును ఆపాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులో పురోగతి లేకుండా చేశారని విమర్శించారు. 70 శాతం పూర్తి అయిన దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించి... నిధులు మొత్తం కాళేశ్వరానికి ఖర్చు పెట్టడం వల్ల దక్షిణ తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు.

ఇప్పుడెందుకు వ్యతిరేకించరు..?

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన లేరని... తనకు అడ్డు వచ్చిన వారిని తొలగిస్తూ ఉద్యమ ద్రోహులను కేసీఆర్ అక్కున చేర్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ చరిత్రను చెరిపి రీడిజైన్​ల పేరుతో తన చరిత్రను రాసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముందు... కేసీఆర్ తర్వాత అన్నట్టు చరిత్రను చూపే ప్రయత్నం జరుగుతుందన్నారు. పోతిరెడ్డిపాడుకు వైఎస్సాఆర్​ శంకుస్థాపన చేస్తే... జగన్ దాన్ని పూర్తి చేసేలా ఉన్నాడని... అప్పుడు వ్యతిరేకించిన కేసీఆర్... ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉద్యమాలతో మహబూబ్​నగర్​ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు, ప్రజలపై ఉందని... అందరూ కలసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలి. దక్షిణ తెలంగాణ నష్టపోవడానికి కేసీఆర్ ప్రధాన కారణమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందుకు తగిన కార్యచరణ రూపొందించేందుకు టీ-జర్నలిస్ట్ ఫోరం సిద్ధంగా ఉంది.

- పల్లె రవి కుమార్, టీ-జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు

ఇదీ చూడండి: అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.