ఉగ్రవాదుల దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఏపీలోని ప్రకాశం పోలీసులు రూపకల్పన చేసిన స్వాట్ (స్పెషల్ వెపన్ అండ్ టెక్నిక్) టీం క్షేత్ర ప్రదర్శన బృంద సామర్ధ్యానికి అద్దం పట్టింది. జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ ఆలోచనల నుంచి పుట్టిన స్వాట్ టీం.. విన్యాసాలు అబ్బురపరిచాయి. రిజర్వు పోలీసుల్లో కొంతమంది సిబ్బందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.
ప్రకాశం పోలీస్ శాఖ సామర్ధ్యం పెంచడానికి కఠినమైన శిక్షణ ఏర్పాటు చేసి, ఆ శిక్షణలో భాగంగా తీవ్రవాద నిర్మూలన కోసం కొత్త వ్యూహాలు, మెళకువలను పరిచయం చేశారు. కరోనా సమయంలోనూ ఏ విధమైన అనారోగ్యానికి గురి కాకుండా వారి శిక్షణలో భాగంగా ఆపరేషన్స్, సమస్యాత్మక ప్రాంతాలపై పర్యవేక్షణ, ఫైరింగ్ శిక్షణ కొనసాగించారు. మత పరమైన అంశాల్లో రాజకీయ ప్రమేయం వల్ల దాడులు నివారించడానికి సైతం స్వాట్ టీం సహకారాన్ని అందిస్తోందని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: దేవుళ్లతో రాక్షసులే కొట్లాడుతారు: డీకే అరుణ