కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ నిలిపివేసింది. ఆన్‌లైన్‌లోనే కేసుల విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీచేసింది.
ఈ మేరకు కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ నిలిపి వేసిన హైకోర్టు.. సగం మంది సిబ్బందే విధులకు హాజరు కావాలని తెలిపింది. సిబ్బంది రోజు విడిచి రోజు విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులో పేర్కొంది. మిగతా సిబ్బంది అత్యవసర విధులకు సిద్ధంగా ఉండాలని.. నగరం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసరించాలని సిబ్బందికి సూచించింది.
ఇవీచూడండి: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్