ETV Bharat / city

ఎల్జీ పాలీమర్స్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

author img

By

Published : May 1, 2021, 8:17 AM IST

ఏపీలోని విశాఖ ఎల్జీ పాలీమర్స్‌ కేసులో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. విశాఖ ఎల్జీ పాలీమర్స్‌లో గతేడాది మే 1న విష వాయువు విడుదలై పలువురు మృతిచెందిన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతోంది. విచారణలో భాగంగా ఎల్జీ పాలీమర్స్‌ ఉత్పత్తులు, ముడి సరకు విక్రయంతో వచ్చిన ఆదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద జమ చేయాలని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎల్జీ పాలీమర్స్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ కేఎం జోసఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది.

ap lg polymers case news, supreme-notices-to ap government
ఎల్జీ పాలీమర్స్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఎల్జీ పాలీమర్స్‌ పరిశ్రమలో ఉత్పత్తులు, ముడి సరకు విక్రయాల సొమ్మును విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద జమ చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహా ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విశాఖ ఎల్జీ పాలీమర్స్‌లో గతేడాది మే 1న విష వాయువు విడుదలై పలువురు మృతిచెందిన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతోంది. విచారణలో భాగంగా ఎల్జీ పాలీమర్స్‌ ఉత్పత్తులు, ముడి సరకు విక్రయంతో వచ్చిన ఆదాయాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌ వద్ద జమ చేయాలని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.

ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎల్జీ పాలీమర్స్‌... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ యూ.యూ లలిత్‌, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ కేఎం జోసఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఎల్జీ పాలిమర్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ఇప్పటికే 37 కోట్ల రూపాయల పరిహారం చెల్లించామని తెలిపారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాల ప్రకారం 50 కోట్లు కలెక్టర్‌ వద్ద డిపాజిట్‌ చేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఉత్పత్తులు, ముడిసరకు విక్రయంతో వచ్చిన సొమ్మును కలెక్టర్‌ వద్ద జమ చేయమని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని ధర్మాసనాన్ని రోహత్గీ అభ్యర్థించారు. ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టులో అమికస్‌ క్యూరీ వైవి రవిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫు న్యాయవాది మహపూజ్‌ నజ్కీకి ఈ విషయాన్ని తెలియజేయాలని రోహత్గీకి సుప్రీం సూచించింది.

ఇవీ చదవండి: రాష్ట్రంలో ఇవాళ, రేపు వ్యాక్సినేషన్‌ నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.