ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించింది. పోలింగ్ నిర్వహణపై ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్‌ఈసీ వాయిదా వేయిడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారించింది.
ఏపీలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని సర్వోన్నత న్యాయస్థానం రద్దుచేసింది. తదుపరి ఆదేశాలిచ్చేవరకు ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని పేర్కొంది. ప్రస్తుత పథకాలను కొనసాగించేందుకు అనుమతిచ్చింది.
ఇదీ చూడండి: ఏపీలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు నిలిపివేత