SC on relieved employees: ఆంధ్రా నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన 12 మంది ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు రిలీవ్ అయిన ఉద్యోగులకు 3 వారాల్లోపు పెండింగ్ జీతాలు చెల్లించాలని ఇరు తెలుగు రాష్ట్రాలకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్ జీతాలపై ఉద్యోగులు సుప్రీంను ఆశ్రయించారు. రిలీవ్ అయిన ఉద్యోగుల తరఫున అనుమోలు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు.
వారికీ పోస్టింగ్ ఇవ్వాలి
రిలీవ్ అయిన ఉద్యోగులకు సర్వీసు బ్రేక్ లేకుండా క్రమబద్ధీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారికి కోర్టు ఖర్చులు చెల్లించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో అభ్యర్థికి రూ.10 వేలు చొప్పున చెల్లించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం.. కోర్టుకు రాని మిగిలిన అభ్యర్థులకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని పేర్కొంది.
ఇదీ చదవండి: Errabelli comments on central Govt : 'కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి మరోమారు బట్టబయలైంది'