ETV Bharat / city

సుప్రీంలో ఒడిశా పిటిషన్​పై ఏపీ అఫిడవిట్ - సుప్రీం కోర్టు అప్​డేట్

తమ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని.. సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ.. 4 వారాలకు వాయిదా వేసింది.

సుప్రీంలో ఒడిశా పిటిషన్​పై ఏపీ అఫిడవిట్
సుప్రీంలో ఒడిశా పిటిషన్​పై ఏపీ అఫిడవిట్
author img

By

Published : Feb 19, 2021, 1:47 PM IST

ఏపీ సర్కారుపై.. సుప్రీం కోర్టులో ఒడిశా ప్రభుత్వం వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై​ విచారణ జరిగింది. తమ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ.. ఒడిశా సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఎం ఖాన్ విల్కర్ ధర్మాసనం విచారణ జరిపింది.

ఒడిశా పిటిషన్​పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయనగరం కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోటియా పరిధిలో ఉన్న 3 గ్రామాలు.. ఏపీకి చెందినవేనని ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. మూడు గ్రామాల్లో గతంలోనూ ఎన్నికలు నిర్వహించినట్లు వివరించారు.

ఆ మూడు గ్రామాలు... అరకు ఎంపీ, సాలూరు అసెంబ్లీ స్థానాల పరిధిలోనివనీ.. ఒడిశా పిటిషన్​ కొట్టివేయాలని ధర్మాసనాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపీ అఫిడవిట్​పై సమాధానానికి ఒడిశా ప్రభుత్వం 4 వారాల గడువు కోరింది. ఇరువరి వాదనలు విన్న ధర్మాసనం తదపురి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

ఇవీచూడండి: 'పరీక్షలో ఏదో ఒకటి రాసి పేపర్ నింపండి చాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.