ETV Bharat / city

అభివృద్ధి పనులు చేయాలంటే ఈసీ అనుమతి తీసుకోండి: సుప్రీంకోర్టు - స్థానిక ఎన్నికలపై సుప్రీంలో విచారణ

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. అభివృద్ధి పనులు చేయాలంటే ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

supreme court
supreme court
author img

By

Published : Nov 16, 2020, 10:14 PM IST

నిర్దిష్ట అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈసీ అనుమతి ఇవ్వకపోతే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని చెప్పింది. ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది.

అభివృద్ధి పనుల ప్రారంభానికి ఈసీ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడు ఈసీ అనుమతి ఎలా తీసుకుంటామని రోహత్గి వాదించారు. ఎన్నికలు రద్దు చేయలేదని, వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరఫు న్యాయవాది పరమేశ్వరి వాదించారు.

ఎన్నికల సంఘం ఏదైనా అభివృద్ధి పనులను ఆపిందా అని ఏపీ ప్రభుత్వాన్ని సీజే ప్రశ్నించారు. కొత్తగా ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రోహత్గి తెలిపారు. దీనిపై సుప్రీం స్పందిస్తూ అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

ఇవీ చదవండి: కేటీఆర్ పీఏనంటూ డబ్బు డిమాండ్‌... అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.