తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై.. సుప్రీంకోర్టులో శుక్రవారం జరిగిన విచారణ వాయిదా పడింది. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్క్ంలు సహా.. పలువురు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన 584 మంది ఉద్యోగులను తెలంగాణకు కేటాయించి.. ఏపీ కొత్త వివాదానికి తెరలేపిందని తెలంగాణ విద్యుత్ సంస్థలు పిటిషన్లో పేర్కొన్నాయి.
ఏపీ విద్యుత్ సంస్థలు రీలివ్ చేసిన ఉద్యోగులు 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని.. వారి తరఫు న్యాయవాది సుప్రీం దృష్టికి తెచ్చారు. ఈ దశలో పలువురు న్యాయవాదులు సమయం కోరగా విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇదే కేసులో ప్రతివాదుల అఫిడవిట్‌కు తెలంగాణ విద్యుత్ సంస్థలు రీజాయిండర్‌ను కోర్టుకు సమర్పించాయి.
జస్టిస్ ధర్మాధికారి డిసెంబర్ 12న ఇచ్చిన నివేదికను.. సుప్రీంకోర్టు సహా అందరూ ఆమోదించారని, చిన్నపాటి సవరణలు మాత్రమే సూచించారని రీజాయిండర్‌లో పేర్కొన్నాయి. 584 మంది ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులను తెలంగాణకు కేటాయిస్తూ ముగింపు నివేదిక ఇచ్చి.. కొత్త వివాదానికి తెరలేపారని ప్రస్తావించారు. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికను.. పక్కన పెట్టాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు కోరాయి. తమను ఏపీలోనే కొనసాగించాలని ఉద్యోగులు విజ్ఞప్తిచేశారు.
ఇవీ చూడండి: 'ఇటీవలి సెషన్స్ కు కొనసాగింపుగానే సమావేశాలు'