ETV Bharat / city

న్యాయవ్యవస్థను బెదిరించేందుకే ఏపీ సీఎం జగన్ లేఖ: సుప్రీం న్యాయవాది

author img

By

Published : Oct 16, 2020, 9:34 AM IST

న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి ఏపీ సీఎం జగన్ ప్రయత్నించారని సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ అన్నారు. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను విభజించే లక్ష్మణరేఖలను జగన్ అతిక్రమించారని తెలిపారు. తీవ్రమైన అవినీతి, నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జగన్‌ మోహన్‌ రెడ్డికి 10 నుంచి 30 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని.. దాన్ని తప్పించుకునేందుకే న్యాయ వ్యవస్థను బెదిరించే స్థాయికి తెగించారని పేర్కొన్నారు.

supreme-court-advocate-ashwini-kumar-upadhyay-
సుప్రీం న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ

తీవ్రమైన అవినీతి, నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జగన్‌ మోహన్‌ రెడ్డికి 10 నుంచి 30 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని దాన్ని తప్పించుకునేందుకే న్యాయ వ్యవస్థను బెదిరించే స్థాయికి తెగించారని....... నేతలపై కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టులో పిల్‌ వేసిన న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు, దాన్ని భయాందోళనకు గురి చేయాలన్న దృష్టితోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అభాండాలు వేస్తూ లేఖ రాశారని మండిపడ్డారు. దీన్ని సాధారణంగా వదిలిపెట్టవద్దని, గట్టి హెచ్చరిక సందేశం పంపాలని కోరుతూ అశ్వినీకుమార్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకి గురువారం లేఖ రాశారు.

వాటిని అడ్డుకోవడానికే ఎత్తులు..

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను వేగంగా విచారించి, శిక్షపడ్డవారిని జీవితకాలం నిషేధించాలని, నేరగాళ్లు రాజకీయ పార్టీలు పెట్టకుండా అడ్డుకోవాలని తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు తుది విచారణకు వచ్చిన సమయంలో.... వాటిని అడ్డుకోవడానికి జగన్‌ ఎత్తులు వేస్తున్నారని... న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే దృష్టికి తెచ్చారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఏడాదిలోగా విచారించి, శిక్షపడిన వారిని జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని తాను 2016లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని... ఆ కేసులో వాదనలు పూర్తయ్యాయని.. లేఖలో తెలిపారు.

జస్టిస్‌ ఎన్‌ వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అందుకోసం ఒక విధానాన్ని రూపొందించిందని... చట్టసభల సభ్యులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలోగా పూర్తయ్యేలా చూసేందుకు వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే అంశాన్ని కోర్టు పర్యవేక్షిస్తోందని... అశ్వినీకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు పూర్తయిన తక్షణం శిక్షపడ్డ ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధించే అంశాన్నీ పరిశీలిస్తుందని లేఖలో వివరించారు.. కోర్టులు శిక్షించిన వ్యక్తులు రాజకీయ పార్టీలు స్థాపించడం, లేదంటే పదాధికారులుగా నియమితులవకుండా నిషేధించాలని 2017లో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశానని... ఆ కేసు త్వరలో తుది విచారణకు రానుందని... నల్లధనం, బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్‌లాంటి కేసుల్లో ఉన్న అవినీతిపరులకు వరుస శిక్షలు విధించాలని దాఖలు చేసిన ఇంకో పిల్‌ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని లేఖలో తెలిపారు... జగన్, అతని సహచరులపై నల్లధనం, బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల్లాంటి తీవ్రమైన అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని... అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ విశ్లేషణ ప్రకారం జగన్, అతని సహచరులు తీవ్రమైన నేర, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్నారని... దాని ప్రకారం ఏ వ్యక్తికయినా ఏకకాలంలో శిక్ష అమలు చేస్తే కనీసం 10 ఏళ్లు, సమాంతరంగా శిక్ష అమలు చేస్తే 30 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తన లేఖలో అశ్వినీ కుమార్‌ జస్టిస్‌ బోబ్డేకు వివరించారు.

ఏపీ సీఎం గీత దాటారు

లేఖ రాయడం, విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా.. జగన్‌ న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారన్న అశ్వినీ కుమార్... న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను విభజించే లక్ష్మణరేఖలను జగన్ అతిక్రమించారని తెలిపారు. తాను పేర్కొన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలు తుది విచారణకు వచ్చే సమయంలో న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడానికి లేఖ ద్వారా మోసపూరిత ప్రయత్నం చేశారని... కేసుల విచారణను తప్పుదోవ పట్టించడంతోపాటు, న్యాయవ్యవస్థను భయపెట్టడానికి లేఖను ప్రజల్లోకి విడుదల చేశారని అశ్వినీకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం బెంచ్‌ ముందున్న కేసులే కాకుండా, మొత్తం సుప్రీంకోర్టే ఈ కేసుల విచారణను నిలిపేయాలని జగన్‌ కుయుక్తులు పన్నారని లేఖలో పేర్కొన్న అశ్వినీకుమార్.... అందువల్ల ఈ అంశంపై చర్చించి, తగు చర్య తీసుకోవడానికి మీరు ఫుల్‌కోర్ట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.. భవిష్యత్తులో మరెవ్వరూ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాంటి మోసపూరితమైన ఎత్తుగడలు వేయడానికి భయపడేలా బలమైన హెచ్చరిక సందేశాన్ని పంపాలని న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి ఏపీ సీఎంపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంలో న్యాయవాది పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.