sridevi drama company latest: శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీనియర్ హీరోయిన్ మహేశ్వరి.. వచ్చి రాగానే సుడిగాలి సుధీర్‌పై పంచుల వర్షం కురిపించింది.
ఈ ప్రోమోలో మొదట సుధీర్ మహేశ్వరిని స్వాగతించాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ఈ క్రమంలో ఆమె నమస్కారం పెట్టింది. ఏంటి హలో అంటే నమస్తే అంటారని సుధీర్ అడగగా.. మహేశ్వరి నేను నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావని పంచ్ ఇచ్చింది.
మేడమ్ నన్ను ఎక్కడ ఉండమంటారని సుధీర్ అడగిన వెంటనే మహేశ్వరి నువ్వు నాకు దూరంగా ఉండు అని మళ్లీ పంచ్ డైలాగ్ వదిలింది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి పంచ్‌లు పేలుస్తూ మహేశ్వరి సందడి చేశారు.
ఇదీ చూడండి: టికెట్ రేట్ల వ్యవహారంపై వర్మ సంచలన వ్యాఖ్యలు