ETV Bharat / city

సోషల్‌మీడియా శ్రీమహాలక్ష్ములు.. మిలియన్లలో ఫాలోవర్స్!

author img

By

Published : Apr 18, 2021, 12:24 PM IST

ఇన్‌స్టాగ్రామ్‌ అంటే సామాజిక మాధ్యమమే కాదు.. కాసులు కురిపించే కామధేనువు. అందమైన ఫొటోలతో ఫాలోవర్లనే కాదు... అంతులేని ఫేమ్‌ను సంపాదించుకోవచ్చు. మంచి వీడియో పెడితే లైక్‌లతోనే సరిపెట్టుకునే పనిలేదు... సినిమా, రియాలిటీ షో అవకాశాలనూ ఎగరేసుకుపోవచ్చు. ఉబుసుపోక పెట్టే పోస్ట్‌తోనే కంపెనీలతో యాడ్‌ కాంట్రాక్టులు పట్టేయొచ్చు. అలా ఇన్‌స్టాలో మిలియన్‌కి పైగా ఫాలోవర్స్‌ని కూడగట్టుకొని ఆదాయం, అవకాశం, సెలెబ్రెటీ హోదా అందుకున్న వారిలో భాను, రవళిలతో ఈటీవీ భారత్ ముచ్చటించింది.

social media fame ravali, social media fame bhanu
టిక్ టాక్ రవళి, టిక్ టాక్ భాను

వీలైతే ఫేస్‌బుక్‌, లేదంటే యూట్యూబ్‌, బోర్‌ కొడితే ఇన్‌స్టాగ్రాం.. అదీ కాదంటే స్నాప్‌చాట్‌... ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ వర్చువల్‌ లైఫ్‌లో బిజీ బిజీగా గడిపేవాళ్లు చాలామందే. ఈ సరదా వ్యాపకంతోనే అవకాశాల్ని, ఆదాయాన్నీ సృష్టించుకుంటున్నారు కొందరు. సోషల్‌ మీడియాతో ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌ స్టేటస్‌నూ పెంచుకుంటున్నారు. అభిమానుల మనసూ కొల్లగొడుతున్నారు. ఈవెంట్స్‌, బ్రాండింగ్‌, ప్రమోషన్‌ అంశాలని షేర్‌ చేస్తూ అక్షరాలకు, చిత్రాలకు లక్షలు సంపాదిస్తున్నారు. ప్రతిభ మన సొంతమైతే అవకాశాలు ఎదురొస్తాయి అనడానికి ఈ యువతరంగాలే ఉదాహరణ. డిజిటల్‌ మార్కెట్‌ వీరిని ఇన్‌ఫ్లూయెన్సర్లుగా పిలుస్తోంది. పెద్ద పెద్ద బ్రాండ్ల కంపెనీలు వీరితో ప్రకటనల వీడియోలు చేయించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల మార్కెట్‌ వేల కోట్లలో ఉందంటున్నాయి అధ్యయనాలు.

భాను

దక్షిణాదిలో టాప్‌

  • ఫాలోవర్లు: 11 లక్షలు

టిక్‌టాక్‌లోకి రాక ముందు భాను సాధారణ కాలేజీ అమ్మాయే. ఇప్పుడేమో ఎక్కడికెళ్లినా జనం చుట్టూ మూగేంత సెలెబ్రెటీ. ఈ మిలీనియల్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం వేదికపైకి వచ్చిన రెండేళ్లకే లక్షలమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆ క్రేజ్‌ తనకు లక్షల రూపాయల ఆదాయాన్నీ తెచ్చి పెడుతోంది. వావ్‌, మీషో, అజియో, హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌లాంటి ప్రముఖ సంస్థలకు ప్రకటనలు చేసిందీ భాను.

‘కేఎల్‌ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నా. కాలేజీ నుంచి ఇంటికొచ్చాక ఖాళీగా ఉండేదాన్ని. అప్పుడు సరదాగా డ్యాన్స్‌ వీడియోలు చేసి టిక్‌టాక్‌లో పెట్టేదాన్ని. కొద్దికాలంలోనే వాటికి ఊహించనంత పేరొచ్చింది. సౌత్‌ క్రియేటర్స్‌లో నేను టాప్‌లో నిలవడం మర్చిపోలేని అనుభూతి. తక్కువ సమయంలోనే ఇన్‌స్టాగ్రామ్‌ భాగస్వామ్యంతో ప్రమోషన్‌ వీడియోలు చేస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నా. ఈటీవీలో ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’, ‘బెస్ట్‌ హాఫ్‌’, ‘జబర్దస్త్‌’లో పనిచేసే అవకాశం వచ్చింది. తొలిసారి ‘అనుకున్నది ఒక్కటీ అయినది ఒక్కటీ’ షోలో కనిపించా. ఆ సందర్భంగా చేసిన వానా వానా వెల్లువాయె పాట ప్రోమో మంచి పేరు తెచ్చిపెట్టింది. మాది విజయవాడ. అమ్మానాన్న వ్యాపారం చేస్తారు. నా ఆసక్తిని గమనించి బాగా ప్రోత్సహిస్తుంటారు. అక్క, అన్నయ్య నాకు మంచి విమర్శకులు’.

-భాను

- క్రిస్టెన్‌ రవళి

రాత్రికి రాత్రే గుర్తింపు

  • ఫాలోవర్లు: 12 లక్షలు

ళాకారుల కుటుంబం నుంచి వచ్చిన రవళికి సహజంగానే సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఎక్కువ. దాంతో రకరకాల స్టిల్స్‌, డ్యాన్స్‌లు, డైలాగ్‌లను అనుకరిస్తూ ఇన్‌స్టాలో తెలుగు, తమిళ వీడియోలు చేసేది. టిక్‌టాక్‌కి ముందే ఇన్‌స్టాలో వేలమంది ఫాలోవర్లని సంపాదించుకుంది. లాక్‌డౌన్‌లో ఆకుపచ్చ డ్రెస్‌ వేసుకుని ఇచ్చిన ఫోజులతో చేసిన టిక్‌టాక్‌ వీడియోతో రాత్రికి రాత్రే మిలియన్‌ వ్యూస్‌ వచ్చిపడ్డాయి. తర్వాత నీలీ నీలీ ఆకాశం అంటూ ఆమె చేసిన డ్యాన్స్‌ మరోసారి కుర్రకారుని ఊపేసింది. దాంతో ఒక్కసారిగా సోషల్‌మీడియా సెలెబ్రెటీ జాబితాలో చేరిపోయింది రవళి. మొదట షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది. ప్రస్తుతం ఓ ఓటీటీకోసం సంధ్యానామ ఉపాసతే! అనే సినిమాలో నటిస్తోంది. కేఎల్‌ఎం ఫ్యాషన్స్‌, లాండ్‌స్క్వేర్‌ వంటి సంస్థల ప్రకటనల కోసమూ పనిచేస్తోంది.

‘అమ్మది తమిళనాడు, నాన్నది ఆంధ్రప్రదేశ్‌. తిరుపతిలో స్థిరపడ్డాం. అమ్మానాన్నలిద్దరూ టీటీడీ ఉద్యోగులు. తాతగారు ఒసేయ్‌ రాములమ్మ సినిమాలో తబలా వాయించే పాత్రలో కనిపించారు. దాంతో నాకు ఈ రంగంపై తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. డీఫార్మసీ చేయాలనుకున్నా. చివరి ఏడాది ఇంటర్న్‌షిప్‌ మాత్రం మిగిలిపోయింది. త్వరలోనే దాన్ని పూర్తిచేస్తా. హాలీవుడ్‌ నటి క్రిస్టెన్‌ స్టూవర్ట్‌పై అభిమానంతో ఆ పేరు పెట్టుకున్నా. అందరికీ అది గుర్తుండిపోయింది.

-క్రిస్టెన్ రవళి

ఇదీ చదవండి: జూ.ఆర్టిస్ట్​గా పనికిరావని విజయ్ తిట్టేవారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.