జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీకి విద్యార్థులు క్యూ కట్టారు. ఎంసెట్ పరీక్షా సమయంలో విద్యార్థులు పరీక్షా కొందరు ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్కు బదులుగా.. మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారు. అయితే.. విద్యార్థులు చేసిన తప్పును అధికారులు పరిశీలించకపోవడం వల్ల గందరగోళానికి తెరలేపింది.
విద్యార్థులు ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్లను క్రాస్ వెరిఫై చేయకుండానే అధికారులు ఫలితాలు విడుదల చేశారు. అయితే.. పరీక్షా ఫలితాల కోసం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన కొంతమంది విద్యార్థులకు ఫలితాలు చూపించలేదు. మొదటి సంవత్సరం నెంబర్ ఎంటర్ చేసి ప్రయత్నించగా ఫలితాలు వచ్చాయి. కంగారు పడ్డ విద్యార్థులు పొరపాటును చక్క దిద్దుకునేందుకు.. జేఎన్టీయూకు క్యూ కట్టారు. పరీక్షా సమయంలో ద్వితీయ సంవత్సరం నెంబర్లు తీసుకోకపోవడం వల్లనే మొదటి సంవత్సరం నెంబర్లు వేశామని.. విద్యార్థులు చెప్తున్నారు.
- ఇదీ చదవండి: అమానుషం.. బాలుడిని దారుణంగా హత్య చేసిన పిన్ని