ETV Bharat / city

కాలేజీలకు వెళ్లకుండానే ఎంటెక్‌ పట్టా..! - Academic conditions with corona

కరోనా ఉద్ధృతి కారణంగా విద్యాసంస్థలను ప్రభుత్వం మూసివేసింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పాఠశాలలు, కళాశాలల్లో పూర్తి స్థాయిలో తరగతులు జరగలేదు. కొన్నింటికి ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించినా.. మరి కొన్నింటికి వీలు కాలేదు. అయితే 2020-21లో ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు దాదాపు కళాశాలకు వెళ్లకుండానే పీజీ పట్టా చేతికందనుంది.

Academic conditions with corona
కరోనాతో విద్యారంగం అవస్థలు
author img

By

Published : May 8, 2021, 9:38 AM IST

ఎంటెక్‌, ఎంఫార్మసీ రెండేళ్ల కోర్సులు.. వాటిలో మొదటి ఏడాది రెండు సెమిస్టర్లు మాత్రమే థియరీ తరగతులుంటాయి. మూడో సెమిస్టర్‌లో ఉండేది కేవలం రెండు సబ్జెక్టులు, మిగతాదంతా ప్రాజెక్టు వర్కే. సంబంధిత రికార్డు సమర్పిస్తే సరిపోతుంది.. ఇదీ సాధారణంగా ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సులు పూర్తయ్యే తీరు. గత ఏడాది వాటిలో చేరిన విద్యార్థులకు కరోనా ప్రభావంతో ఆ ఒక్క ఏడాదీ కూడా దాదాపు కళాశాలలకు వెళ్లకుండానే పీజీ పట్టా చేతికందనుంది.

వెళ్లింది 30-40 రోజులే...

2020-21 విద్యా సంవత్సరం.. కరోనాతో కళాశాలలు తెరుచుకోకపోవడంతో గత ఏడాది ఎంటెక్‌/ఎంఫార్మసీలో చేరిన విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు మొదలయ్యాయి. రాష్ట్రంలో దాదాపు 5 వేల మంది ఎంటెక్‌, 2 వేల మంది ఎంఫార్మసీలో ప్రవేశాలు పొందారు. వారికి మొదటి సెమిస్టర్‌ మార్చితో పూర్తయ్యింది. ఫిబ్రవరి, మార్చిలో కేవలం 30-40 రోజులే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. రెండో సెమిస్టర్‌ ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభమైంది. వారికి సెప్టెంబరు 18తో పరీక్షలు పూర్తవుతాయి. మూడో సెమిస్టర్‌లో రెండు సబ్జెక్టులే ఉంటాయి. మిగతా సమయం ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించాలి. నాలుగో సెమిస్టర్‌ వరకు ప్రాజెక్టు వర్కే ఉంటుంది.
మూడో సెమిస్టర్‌పైనా ఆశల్లేవు?
మూడో సెమిస్టర్‌ అక్టోబరు నుంచి మొదలై ఫిబ్రవరితో పూర్తవుతుంది. అందులో అయినా ప్రత్యక్ష తరగతులు ఉంటాయా అంటే చెప్పలేమని, కరోనా పరిస్థితులపై అది ఆధారపడి ఉంటుందని జేఎన్‌టీయూహెచ్‌ ఆచార్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఎంటెక్‌లో చాలా మంది విద్యార్థులు తరగతులకు రావడం లేదని బయోమెట్రిక్‌ హాజరు ప్రవేశపెట్టామని, దాంతో ఇప్పుడు కచ్చితంగా పీజీ చేయాలన్న వారే చేరుతున్నారని, ఇప్పుడు కరోనాతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం జేఎన్‌టీయూహెచ్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి: సత్ఫలితాలనిస్తున్న భరోసా కేంద్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.