కరోనా మహమ్మారి... ప్రపంచదేశాలను వణికిస్తోంది. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే పరిష్కారమని ప్రపంచమంతా అని భావిస్తున్న సమయంలో భారత్‌లో ఇండిజినిస్ వ్యాక్సిన్ తయారీకి ముందుకు వచ్చిన భారత్ బయోటెక్... కొవాగ్జిన్ కాండీడ్‌ను రూపొందించింది. ఎన్ఐఎన్, ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ ఈ టీకాను తయారు చేస్తోంది. కొవాగ్జిన్ కాండీడ్‌ను ముందుగా రీసస్ కోతులపై ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు సాధించింది. మనషులపై ప్రయోగాలకు భారత్ ఔషధ నియంత్రణ మండలి... భారత్ బయోటెక్‌కు అనుమతులు జారీ చేసింది.
26వేల మందిపై మూడో దశ ట్రయల్
ఈ ఏడాది.. జులైలో మొదటి సారి దేశ వ్యాప్తంగా 12 కేంద్రాల్లో... 375 మందిపై తొలివిడత ప్రయోగాలు నిర్వహించారు. 14 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా ఇచ్చిన వ్యాక్సిన్ డోస్ సత్ఫలితాలు ఇచ్చినట్టు భారత్ బయోటెక్ ప్రకటించింది. అనంతరం సెప్టెంబర్‌లో 750 మందిపై నిర్వహించిన రెండో దఫా ట్రాయల్స్ కూడా సత్ఫలితాలను ఇవ్వడంతో... ఈ నెల మొదటి వారం నుంచి దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో... 26 వేల మందిపై మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తోంది భారత్ బయోటెక్.
ఆ దేశాలు మినహా టీకా సరఫరాకు హక్కులు
కొవాగ్జిన్‌తో పాటు నాజర్ స్ప్రే, మోనోక్లోనల్ యాంటీ బాడీస్ థెరపుటిక్స్ తయారీపై పరిశోధనలు చేస్తోంది భారత్ బయోటెక్. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ మెడిసిన్‌తో ఒప్పందం చేసుకుంది. అమెరికా, జపాన్, ఐరోపా మినహా ప్రపంచ దేశాల్లో టీకా సరఫరా హక్కులు సాధించింది. చింపాంజీ.. అడినో వైరస్ ఆధారంగా దీనిని తయారు చేస్తున్నారు. న్యూ మిలినియం టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేటివ్, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రీ డొమిక్స్ సంస్థలతో కలిసి... కొవిడ్‌పై అత్యంత ప్రభావవంతంగా పనిచేసే... హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీ బాడీలను తయారు చేస్తోంది. ఫలితంగా కొవిడ్‌ను ఎదుర్కోవడం కోసం కావాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్లపై ప్రయోగాలు చేస్తోంది.
భారత్ బయోటెక్‌లో గంట సేపు మోదీ
కొవిడ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తూ... భారీ స్థాయిలో మూడో ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్‌ను ప్రధాని మోదీ ఇవాళ సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా టీకా తయారిపై శాస్త్రవేత్తలతో చర్చించనున్నట్లు సమాచారం. దాదాపు గంట సేపు ప్రధాని భారత్ బయోటెక్‌లో గడపనునట్లు తెలుస్తోంది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను సంస్థ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి : ఇవాళ హైదరాబాద్ రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ