ETV Bharat / city

రాష్ట్రంలో హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల స్టయిఫండ్ పెంపు - తెలంగాణ వార్తలు

stipend of house surgeon, PG medicos is increased in Telangana

author img

By

Published : May 18, 2021, 2:22 PM IST

Updated : May 18, 2021, 3:11 PM IST

14:19 May 18

రాష్ట్రంలో హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల స్టయిఫండ్ పెంపు

హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు, సూపర్ స్పెషాలిటీ విద్యార్థుల స్టయిఫండ్​ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు స్టయిఫండ్​ను పెంచుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ హౌస్ సర్జన్లు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమో, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థి వైద్యులకు 2021 జనవరి ఒకటి నుంచి ప్రస్తుత స్టయిఫండ్​పై 15 శాతం పెంచుతున్నట్లు తెలిపింది.

స్టయిఫండ్​లు ఇలా...

మెడికల్, డెంటల్ హౌస్​సర్జన్లకు ఇక నుంచి నెలకు రూ.22,527 వస్తుంది. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ మొదటి సంవత్సరం వారికి నెలకు రూ.50,686 స్టయిఫండ్ ఇస్తారు. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ రెండో ఏడాది వారికి రూ. 53,503... పీజీ డిగ్రీ, ఎండీఎస్ మూడో ఏడాది వారికి రూ.56,319 ఇస్తారు. సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం వారికి రూ. 56319, రెండో ఏడాది వారికి రూ.59135, మూడో సంవత్సరం వారికి రూ.61949 రూపాయలు స్టయిఫండ్ రానుంది.  

ఇదీ చూడండి: మరోసారి పరస్పర విమర్శలకు దిగిన ఈటల, గంగుల

Last Updated : May 18, 2021, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.