ETV Bharat / city

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు

author img

By

Published : Feb 18, 2021, 5:12 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలోని పలు జిల్లాలో ఆందోళనలు చేపట్టారు. కర్మాగారం ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని నేతలు హెచ్చరించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా... ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా సీఐటీయూ, ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

విశాఖపట్నం జిల్లా

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలని డా.బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు ఐ.గురుమూర్తి డిమాండ్ చేశారు. నగరంలోని అంబేడ్కర్​ భవన్​లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం... సామాన్యులకు ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు పెట్టుబడిదారులకు ద్వారాలు తెరుస్తుందని విమర్శించారు.

కడప జిల్లాలో...

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కడప కలెక్టరేట్ ఎదుట ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేంద్రం.. కర్మాగారం ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

కర్నూలు జిల్లా...

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయకూడదని కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు మద్దతుగా ధర్నా చేశారు.

విజయనగరం జిల్లా...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బొబ్బిలిలో ప్రజా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దీనిని పరిరక్షించుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు దశలవారీగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చదవండి: కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది.. ఉన్మాదం గెలిచింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.