మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు ఎంతో కృషి చేస్తున్నాయని... ఆయా రాష్ట్రాల మధ్య సమన్వయం ఉంటే మంచి ఫలితాలొస్తాయని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పొరుగు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలని సూచించారు. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఏపీ, కేరళ, ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మానవ అక్రమ రవాణా నిరోధించడానికి పొరుగు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని మహిళా భద్రతా విభాగం పోలీసులు నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల్లో తప్పిపోయిన చిన్నారులు, మహిళలను దర్పన్ అప్లికేషన్ ద్వారా గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందిస్తున్నామని మహేందర్ రెడ్డి తెలిపారు. అక్రమ రవాణా నిరోధానికి రాష్ట్రాల్లో చేపడ్తున్న చర్యలను ఆయా రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.
ఇదీ చదవండి: పిన్‌ప్రింట్ టెక్నాలజీస్ కాల్‌సెంటర్‌పై సీసీఎస్ దాడులు