ETV Bharat / city

వేతనాలు పెంచమంటే.. అప్పు సాకుగా చూపడమేంటి?: ఎస్టీయూ

author img

By

Published : Jan 28, 2021, 8:35 PM IST

అవసరమైతే అప్పుతెచ్చైనా పీఆర్సీ ఇవ్వాలి గానీ... వేతనాల పెంపు కోసం అప్పులను సాకుగా చూపడం సబబు కాదని... ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గౌడ్​ వ్యాఖ్యానించారు. పీఆర్సీ నివేదికలో కుట్ర జరిగిందని ఆరోపించారు.

వేతనాలు పెంచమంటే.. అప్పులు సాకుగా చూపడమేంటి?: ఎస్టీయూ

ఉద్యోగులు వేతనాల పెంపు కోసం అప్పులను సాకుగా చూపడం సబబు కాదని... అవసరమైతే మరో రూ. 20 వేల కోట్లు అప్పు తీసుకొచ్చి మంచి ఫిట్​మెంట్​ ఇవ్వాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎస్ నేతృత్వంలోని కమిటీ పీఆర్సీ నివేదికపై... ఏస్టీయూ ప్రతినిధులతో చర్చించింది. ఎలాంటి శాస్త్రీయ లేకుండా పీఆర్సీ నివేదికలో మార్పులు చేసి... 7.5 శాతం ఫిట్​మెంట్​ సిఫారసు చేశారని ఆరోపించారు.

కరోనా నేపథ్యంలో ఆలోచించాలన్న సీఎస్ సూచన భావ్యం కాదని సదానంద గౌడ్ అన్నారు. పీఆర్సీ నివేదికలో కుట్ర జరిగిందని ఆరోపించిన ఎస్టీయూ... 17.5 శాతంతో మాస్టర్ స్కేల్స్ రూపొందించి 7.5 శాతంగా మార్చారని ఆరోపించారు. ఏపీలో 27 శాతం ఐఆర్ ఇస్తే... ఇక్కడ 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. సరైన ఫిట్​మెంట్​ ఇవ్వకపోతే పీఆర్సీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎవరినడిగి ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచారని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 'హుస్సేన్​సాగర్ ఒడ్డున 125 అడుగుల అంబేడ్కర్​ విగ్రహం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.