ప్రభుత్వం ఆస్తి యజమానికి చెందిన మొత్తం 11 అంశాలతో పాసుపుస్తకాలను సిద్ధం చేస్తోంది. ముదురు ఎరుపు (మెరూన్) రంగుతో కూడిన ఈ పుస్తకాల్లో.. ఆస్తి యజమాని పేరు, చిత్రం, సంతకం, ఫోన్ నంబర్, కులం, ఆస్తి సంక్రమించిన వివరాలు, ప్లాట్ పరిమాణం, సర్వే నంబర్ తదితర సమాచారాన్ని పొందుపరుస్తోంది.
రెండు పేజీల్లో బార్‌కోడ్, హోలోగ్రాంతోపాటు వివరాలు చేర్చనుంది. ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ధరణి పోర్టల్‌ద్వారా ఈ పుస్తకాలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. యజమాని కలిగిఉండే ప్రతి ఆస్తికీ ఒక పాసుపుస్తకం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఒక వ్యక్తికి ఎన్ని ఆస్తులుంటే అన్ని ఆస్తులకు పాసుపుస్తకాలు ఇవ్వనున్నారు. వ్యక్తుల ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ‘ధరణి’లో నమోదు చేస్తారు.
ఎన్‌ఏపీఆర్ ఆధారంగా..
పట్టణాలు, నగరాల్లో వ్యవసాయేతర ఆస్తులకు ప్రతి యజమానికి నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ రికార్డు(ఎన్‌ఏపీఆర్)ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. ఆ సమాచారాన్నే పుస్తకంలో ప్రచురించనున్నారు.
ఇవీ చూడండి: ఆరు నెలల్లో అందుబాటులోకి ఆక్స్ఫర్డ్ టీకా!