ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి... ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా... శాస్త్రీయంగా వార్డుల విభజన చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులకు స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులతో సమావేశమైన ఎస్ఈసీ... ఖమ్మం నగరపాలిక ఎన్నికల ప్రక్రియపై చర్చించింది.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు పురపాలికల్లో వెంటనే వార్డుల విభజన చేపట్టాలని పురపాలక శాఖ సంచాలకులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని పార్థసారథి తెలిపారు. వార్డుల విభజన విధివిధానాలకు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. అందుకు అనుగుణంగా వార్డుల విభజన చేపట్టాలని అన్నారు. వార్డుల విభజన నోటిఫికేషన్ గెజిట్లో ప్రకటించాక వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తుందని పార్థసారథి తెలిపారు.