హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రి సరికొత్త మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆస్పత్రి చీఫ్ జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్ డాక్టర్ నీలం వి. రమణారెడ్డి పేర్కొన్నారు. మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటే కనీసం వారం రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చేదని ఆయన పేర్కొన్నారు. అయితే కొవిడ్ సమయంలో ఆస్పత్రిలో ఉండేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపటంలేదని తెలిపారు.
ఈఆర్ ఏఎస్గా పేర్కొనే ఈ రకం శస్త్రచికిత్స కారణంగా రోగి ఒక్క రోజులోనే తిరిగి నడవగలరని వివరించారు. శస్త్రచికిత్స చేసిన తర్వాతి రోజే రోగిని డిశ్చార్జ్ చేస్తామన్న ఆయన.. సాధారణ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సతో పోలిస్తే ఈఆర్ ఏఎస్ తక్కువ ఖర్చుతో పూర్తవుతుందన్నారు. అయితే రోగి వయసు, వారి ఇతరత్రా అనారోగ్య పరిస్థితులను గమనించి.. అర్హులైన వారికి మాత్రమే ఈ రకం శస్త్రచికిత్స చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో భృతి: కేటీఆర్