స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ బలగాలు, దిల్లీ పోలీసు నియామకాలకు సంబంధించిన పరీక్షల వివరాలు, తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లో నాలుగు రకాల ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.
కొవిడ్ నిబంధనలు అనుసరించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పరీక్షలను నిర్వహిస్తామని పత్రికా ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొంది.
ఇదీ చూడండి: 7 వేల SSC ఉద్యోగాలకు పరీక్ష ఎప్పుడంటే?