ETV Bharat / city

SSC MARKS: పది మార్కులపై తుది నిర్ణయం.. ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా మదింపు - ఏపీ పది మార్కుల వార్తలు

కరోనా ఉద్ధృతితో పరీక్షలు రద్దవ్వడంతో పదోతరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై ఏపీ విద్యాశాఖ దృష్టిసారించింది. ఫార్మెటివ్‌కు సంబంధించి స్లిప్ టెస్ట్ రాత పరీక్షకు 70 శాతం వెయిటేజీ ఇవ్వాలని మార్కుల మదింపు కమిటీ నిర్ణయించింది. అంతర్గత మదింపునకు 30శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది.... పదో తరగతి విద్యార్థులకు 50 మార్కుల చొప్పున పెట్టిన రెండు ఫార్మెటివ్‌ పరీక్షల ఆధారంగా మార్కుల మదింపు చేయనున్నారు.

SSC MARKS: పది మార్కులపై తుది నిర్ణయం.. ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా మదింపు

author img

By

Published : Jul 15, 2021, 8:19 AM IST

పది మార్కులపై తుది నిర్ణయం.. ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా మదింపు

కరోనా దృష్ట్యా పదో తరగతి పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా.. ఫలితాల వెల్లడికి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ.. మార్కుల కేటాయింపునకు సంబంధించి తుది నిర్ణయానికి వచ్చింది. 50 మార్కులకు పెట్టిన ఫార్మెటివ్‌ పరీక్షలో.. 20 మార్కుల రాత పరీక్షకు 70శాతం, ఇతర 30 మార్కులకు 30శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు 50 మార్కుల చొప్పున రెండు ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రాత పరీక్షకు 20 మార్కులు, ప్రాజెక్టులకు10, నోటు పుస్తకాల రాతకు 10, తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు కేటాయించారు. పరీక్ష మొత్తం 50 మార్కుల సగటు తీసుకోగా.. దీనిలో 70శాతం అంటే 35 మార్కులను వెయిటేజీగా తీసుకుంటారు. రాత పరీక్ష 20 మార్కులను 35కు తీసుకువస్తారు. ఉదాహరణకు ఓ విద్యార్థికి రాతపరీక్షలో 20 మార్కులకుగానూ 18 వస్తే.... 35 మార్కులకు దాన్ని లెక్కిస్తే.... విద్యార్థి స్కోర్ 31.5 మార్కులకు చేరుతుంది. మిగతా 30 మార్కులను 30శాతం వెయిటేజీతో 15మార్కులకు కుదిస్తారు. విద్యార్థికి 30మార్కులకుగానూ 27 వస్తే వెయిటేజీ ప్రకారం 13.5గా పరిగణిస్తారు. మొత్తం కలిపి ఫార్మెటివ్‌లో 45మార్కులు వచ్చినట్లు లెక్కిస్తారు. ఈ విధానంలోనే రెండో ఫార్మెటివ్ పరీక్షలోని మార్కులనూ లెక్కించనున్నారు.

రెండు ఫార్మెటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి సబ్జెక్ట్ గ్రేడ్ ప్రకటిస్తారు. అన్ని మార్కులను కలిపి మొత్తం గ్రేడ్ ఇస్తారు. హిందీ సబ్జెక్ట్‌కు సంబంధించి గ్రేడ్లు ఒక విధంగానూ, మిగతావాటికి మరో విధంగానూ నిర్ణయించారు. విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా వారి గ్రేడ్లు ఈ విధంగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి: IT HUB : రాష్ట్ర రాజధానిలో మరో ఐటీ హబ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.