ETV Bharat / city

శ్రీవారి బ్రహ్మోత్సవం... నమ్మిన బంటే 'వాహనం' - హనుమాన్​ సేవ

బ్రహ్మోత్సవం... వీక్షించిన భక్తులకు నేత్రోత్సవం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు తాను నమ్మిన బంటైన హనుమద్వాహనంపై శ్రీ వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రికి గజ వాహనంలో తిరు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.

ttd
author img

By

Published : Oct 5, 2019, 10:19 AM IST

శ్రీవారి బ్రహ్మోత్సవం... నమ్మిన బంటే 'వాహనం'

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు... కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఐదు రోజుల్లో తొమ్మిది వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చిన మలయప్ప స్వామి... నేటి ఉదయం హనుమద్వాహనంపై దర్శనమివ్వనున్నారు. శ్రీ రామచంద్రమూర్తి అలంకార ప్రాయుడై... కోదండం చేతపట్టిన శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

నమ్మిన బంటే వాహనంగా

శ్రీ రాముని నమ్మిన బంటైన ఆంజనేయుని వాహనంపై శ్రీనివాసుడు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తిరు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు. భక్తికి ప్రతీకైన హనుమంతుణ్ని... ధర్మానికి మారుపేరైన కోదండ రాముని దివ్యమంగళ స్వరూపాన్ని వెంకటేశ్వరునిలో దర్శించుకునే అవకాశం కలిసి రావడం నిజంగా ప్రత్యేకతేనని ఆగమ పండితులు అభివర్ణిస్తున్నారు.

రాత్రికి గజ వాహన సేవ

శ్రీవారికి హనుమద్వాహన సేవ ముగిసిన అనంతరం ఉభయ నాంచారుల సమేతుడైన మలయప్పస్వామి బంగారు తేరుపై ఊరేగనున్నారు. స్వర్ణ రథంపై విహరిస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకునేందుకు రెండు కళ్లు చాలవు. అత్యంత వైభవంగా జరిగే ఈ రథ రంగ డోలోత్సవానికి సంబంధించి తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రికి స్వామి వారికి గజవాహన సేవ కన్నుల పండువగా జరగనుంది. స్వామి వారికి అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాల కోసం తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇదీ చూడండి: 'మీ జీవితంలో కష్టాలు తొలగాలంటే ఇలా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.