Srisailam Dam gates Lifted: ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం జలాశయం ఏడు గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా లక్షా 95 వేల క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.02 లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి పోటెత్తుతోంది.
జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం885 అడుగులు కాగా.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.70 అడుగులుగా ఉంది. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 213.88 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసి 62,584 క్యూసెక్కులు సాగర్‌కు వదులుతున్నారు.
ఇవీ చూడండి: డిగ్రీ విద్యార్థినిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది