తిరునక్షత్ర మహోత్సవం పేరిట శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామీజీ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామిజీ ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకలకు సంబంధించిన గోడ పత్రికను హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తిరుపతానందస్వామీజీ ఆవిష్కరించారు. ఈనెల 28న తిరునక్షత్ర మహోత్సవం, జీయర్ పురస్కార ప్రధానోత్సవం, 29న గ్రంథావిష్కరణ, 30న దైవ వరివస్య, 31న సహస్త్ర కలశాభిషేకం అంకురార్పణ, నవంబర్ 1న శ్రీరామచంద్ర స్వామికి సహస్త్ర కలశాభిషేకం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ