ఏపీలోని శ్రీకాకుళానికి జిల్లాకు చెందిన భక్తుడు మహంతి శ్రీనివాసరావు.. తిరుపతి నుంచి (అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో) కాలినడకన 300 సార్లు తిరుమలకు చేరుకొని తన భక్తిని చాటుకున్నారు. శనివారం 300వ పర్యాయం తిరుమలకు (300 time reached Tirumala on footway) చేరుకున్నారు. వేంకటేశ్వరస్వామి భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంతో పాటు వారిలో స్ఫూర్తిని, సరికొత్త ఉత్తేజాన్ని నింపుతుందని శ్రీనివాసరావు అంటున్నారు.
1996లో తిరుమలకు కాలినడకన రావడాన్ని ప్రారంభించానని వివరించారు. ఒక రోజులో రెండు, మూడు సార్లు సైతం కాలినడకన తిరుమలకు చేరుకున్నట్లు తెలిపారు. తన భార్య సరస్వతి 53 సార్లు, కుమారుడు 27 సార్లు మెట్ల మార్గంలో వచ్చారని చెప్పారు. తాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందినట్లు వెల్లడించారు.
ఇదీచూడండి: TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తేదీలు ఖరారు