విజయదశమి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాజ్ భవన్లోని ఆలయంలో గవర్నర్ తమిళిసై, భర్త సౌందరరాజన్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధపూజలో పాల్గొన్నారు. వాహనాలు, ఆయుధాలకు ప్రత్యేకంగా పూజలు చేశారు. గవర్నర్ కుటుంబసభ్యులు, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పూజలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్రపతి, ఉపరాష్ట్రపతికి దత్తాత్రేయ విజయదశమి శుభాకాంక్షలు