ETV Bharat / city

ఆ గ్రామాలకు త్వరలోనే త్రిఫేజ్ విద్యుత్ సౌకర్యం - ఆదిలాబాద్ తాజా వార్తలు

అటవీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, పెండింగ్​లో ఉన్న పనులపై అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

department of forest
అధికారుల సమీక్ష
author img

By

Published : Mar 30, 2022, 8:27 PM IST

Department of forest news: మారుమూల ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం, పెండింగ్​లో ఉన్న పనులపై... సంబంధిత జిల్లాల కలెక్టర్లు, విద్యుత్, గిరిజన సంక్షేమ, అటవీశాఖ ఉన్నతాధికారులతో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఆ గ్రామాలకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం నెల రోజుల్లో కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ప్రాధాన్యత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివాసీ, గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని శాంతికుమారి అన్నారు. మొత్తం మూడు వేలకు పైగా గుర్తించిన గ్రామాలకు ఇప్పటికే త్రీఫేజ్ విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మిగిలిన 239 గ్రామాలకూ నెల రోజుల్లో పనులు పూర్తి చేసి విద్యుత్ సౌకర్యం అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్​ 46, కుమురం భీం ఆసిఫాబాద్ 98, మంచిర్యాల 26, నిర్మల్ 42, భద్రాద్రి కొత్తగూడెంలో 27 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఇంకా అందించాల్సి ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు.

జిల్లాల వారీగా ఉన్న సమస్యలు, అటవీ అనుమతులు, జాప్యం, నివారణపై సమావేశంలో చర్చించారు. పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ అటవీ అనుమతులు వేగంగా ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అవసరమైన డాక్యుమెంటేషన్ సరైన పద్దతుల్లో పూర్తి చేస్తే ఆలస్యాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు మౌలికసదుపాయాల కల్పన... ప్రభుత్వ ప్రాధాన్యతని, సంబంధిత శాఖలు పూర్తి స్థాయి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు అన్నారు.

ఇదీ చదవండి:ఐసెట్​, పీజీ ఈసెట్​ నోటిఫికేషన్లు​ విడుదల..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.