హైదరాబాద్ గుడిమల్కాపూర్ డివిజన్లోని దేవాలయాలు బాలాజీ టెంపుల్, ఝాన్సీ టెంపుల్, శ్రీ దర్బార్ మైసమ్మ టెంపుల్లో సోడియం హైపోక్లోరైట్ రసాయనాలతో పిచికారీ చేశారు. కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ బెస్త సూచన మేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది ఆలయ ప్రాంగణం శుద్ధి చేసి ద్రావణం పిచికారీ చేశారు.
భౌతిక దూరం తప్పనిసరి...
క్యూలైన్లలోనూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో ఆలయాన్ని శుభ్రపరిచారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రకాశ్ అధికారులను ఆదేశించారు. దేవాలయాలు పునః ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటించాలని ప్రకాశ్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుంచి ఆలయ తలుపులు తెరిచామని.. కంటైన్మెంట్ జోన్లోని ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో యోగి రాజ్సింగ్ ఆదిత్య యాదవ్, సందీప్ యాదవ్ లఖన్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : సర్కారుపై హైకోర్టు సీరియస్