హైదరాబాద్ నాగోల్ జైపూర్ కాలనీలోని శ్రీ శైవ మహాపీఠం శివాలయం ఆవరణలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీఠాధిపతులు శివ శ్రీ డాక్టర్ అత్తలూరి మృత్యుంజయ శర్మ హాజరయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన సంప్రదాయాల్లో శైవ సంప్రదాయం అతి ప్రాచీనమైనదని మృత్యుంజయ శర్మ తెలిపారు. పరమశివునితో విడదీయరాని సంబంధం నుంచి వైదిక సాహిత్యంతో పెనవేసుకున్న సంప్రదాయంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జన్మించారని గుర్తు చేసుకున్నారు.