ETV Bharat / city

హైకోర్టు సీజే బ్యాటింగ్.. జస్టిస్ ప్రవీణ్ కుమార్ బౌలింగ్ - బ్యాట్ పట్టిన హైకోర్టు సీజే అరూప్ కుమార్ గోస్వామి

ఏపీ హైకోర్టు సీజే అరూప్ కుమార్ గోస్వామి క్రికెట్ గ్రౌండ్​లో బ్యాట్ పట్టారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ బౌలింగ్ చేయగా... సీజే చక్కని షాట్లతో అలరించారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మూలపాడు క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ న్యాయవాదుల క్రికెట్ టోర్నీని న్యాయమూర్తులు ప్రారంభించారు.

హైకోర్టు సీజే బ్యాటింగ్.. జస్టిస్ ప్రవీణ్ కుమార్ బౌలింగ్

author img

By

Published : Feb 26, 2021, 9:21 PM IST

హైకోర్టు సీజే బ్యాటింగ్.. జస్టిస్ ప్రవీణ్ కుమార్ బౌలింగ్

ఎప్పుడూ కేసులతో బిజీగా ఉండే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి హఠాత్తుగా గ్రౌండ్​లో బ్యాట్ పట్టారు. కవర్ డ్రైవ్, డిఫెన్స్ షాట్లతో అలరించారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మూలపాడు క్రికెట్ క్రీడా మైదానంలో జస్టిస్ ప్రవీణ్ కుమార్ బౌలింగ్ వేస్తుండగా కొద్దిసేపు క్రికెట్ ఆడారు. చదువుకున్న సమయంలో రంజీ మ్యాచ్​ల్లో తాను ఆడిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. సౌత్ జోన్ న్యాయవాదుల క్రికెట్ టోర్నీని మూలపాడు క్రికెట్ మైదానంలో హైకోర్టు సీజే ప్రారంభించారు. ఈ టోర్నీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు టోర్నీ జరగనుంది. క్రీడాస్ఫూర్తితో ఆడాలని ఆటగాళ్లకు సీజే పిలుపునిచ్చారు.

విజయవాడలో మొదటి సౌత్ జోన్ అడ్వొకేట్ టోర్నీని ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కృష్ణా మిల్క్ డెయిరీ సహకారంతో టోర్నమెంట్​ను నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: పాత నోటిఫికేషన్​ ప్రకారమే ఎన్నికలు: ఏపీ హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.