ETV Bharat / city

హిమాచల్​ గవర్నర్​ను కలిసిన దక్షిణ కొరియా రాయబారి - Governor Bandaru Dattatreya

హిమాచల్ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయను దక్షిణ కొరియా రిపబ్లిక్ రాయబారి షిన్​బాంగ్​కిల్ మర్యాదకపూర్వకంగా కలిశారు. ఇండో-దక్షిణ కొరియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసే చర్యల గురించి ఇరువురు చర్చించినట్లు సమాచారం.

South Korean Ambassador meets Himachal Pradesh Governor
హిమాచల్ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ
author img

By

Published : Nov 6, 2020, 6:24 AM IST

మానవ వనరుల అభివృద్ధి, పర్యటక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో హిమాచల్ ప్రదేశ్ సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధిని గవర్నర్ దత్తాత్రేయ దక్షిణ కొరియా రిపబ్లిక్ రాయబారి షిన్​బాంగ్​కిల్​కు వివరించారు. పర్యటక రంగంలో హిమాచల్, దక్షిణ కొరియాలు పరస్పరం సహకరించుకుని సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపూర్ జిల్లాలో వారి దేశానికే చెందిన కియా మోటార్స్ నెలకొల్పిన ప్లాంట్ గురించి రాయబారి ప్రస్తావించగా.. తను రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఆ ప్రాంతంలో చేపట్టిన అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాల గురించి అతనికి వివరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి దత్తాత్రేయ, షిన్​బాంగ్ సుమారు గంటపాటు చర్చించారు. ఈ కార్యక్రమంలో రాయబారితో పాటు మంత్రి-కౌన్సిలర్ మిస్టర్ చాంగ్ హో సీయుంగ్, రెండో కార్యదర్శి ఎంఎస్ కాంగ్ యోన్ సూ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.