ETV Bharat / city

దక్షిణ మధ్య రైల్వే రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు

author img

By

Published : Dec 5, 2020, 7:18 PM IST

పలు రైళ్ల రాకపోకల సమయాల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. రైల్లు బయలుదేరు సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక రైళ్ల సమయపట్టీలు ఇలా ఉన్నాయి...

దక్షిణ మధ్య రైల్వే రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు
దక్షిణ మధ్య రైల్వే రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల సమయపట్టీలను మార్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. పలు రైళ్ల రాకపోకల సమయాలను దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. ఉదయం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరాల్సిన హైదరాబాద్- న్యూదిల్లీ ఎక్స్‌ప్రెస్‌ ఆరింటికి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7గంటల 50నిమిషాలకు దిల్లీ చేరుకుంటుంది. హైదరాబాద్- విశాఖపట్నం రైలు సాయంత్రం 05:05కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5: 35నికు విశాఖపట్నం చేరుకుంటుంది. ఆదివారం, గురువారం నడిచే సికింద్రాబాద్‌ - హజరత్‌ నిజాముద్దీన్ రైలు మధ్యాహ్నం 12:55 కు బయలుదేరనుంది.

రోజూ నడిచే సికింద్రాబాద్- దానాపూర్ రైలు ఉదయం 9:25కు బయలుదేరి వెళ్లనుంది. మంగళ, శనివారాలు నడిచే సికింద్రాబాద్- దర్బాంగ్ జంక్షన్ రైలు రాత్రి 10:40నిమిషాలకు... మంగళవారం మాత్రమే నడిచే సికింద్రాబాద్- షాలీమార్ రైలు ఉదయం 3: 55కు బయలుదేరనుంది. లింగపల్లి - కాకినాడ టౌన్​కు సోమ,బుధ, శుక్రవారాల్లో నడిచే ఈ రైలు సాయంత్రం 7గంటలకు బయలుదేరి వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య శనివారం మాత్రమే నడిచే రైలు రాత్రి 9గంటల 35నిమిషాలకు బయలుదేరుతుందని రైల్వే శాఖ అధికారులు వివరించారు.

ఫెస్టివల్ స్పెషల్‌ రైళ్ల వివరాలు ఇలా...

లింగంపల్లి-తిరుపతి రైలు సాయంత్రం 6గంటల 25నిమిషాలకు బయలుదేరుతుంది. సోమ, బుధవారం రోజుల్లో నడిచే హైదరాబాద్ - జైపూర్‌ రైలు రాత్రి 8:35కు... గురువారం మాత్రమే నడిచే హైదరాబాద్- రాక్సాల్ జంక్షన్ రైలు రాత్రి 11:05కు బయలుదేరనుంది. సోమ, మంగళ, శనివారాల్లో నడిచే సికింద్రాబాద్-రాజ్‌కోట్‌ రైలు సాయంత్రం 5గంటలకు బయలుదేరి వెళుతుందని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

ఇదీ చూడండి: హైదరాబాద్​ను భాగ్యనగరంగా మార్చాల్సిందే: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.